బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. వరుసగా పసిడి రేటు పడుతూ వస్తోంది. 3 రోజుల్లో ఏకంగా రూ. 900 మేర పడిపోవడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనం అవుతోంది. లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.350 పడిపోయింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.54,700 వద్ద ఉంది. క్రితం రోజు కూడా రూ.350 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు రెండు రోజులు కూడా రూ.100 చొప్పున తగ్గింది. దీంతో 3 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.900 పడిపోవడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.380 పడిపోగా 10 గ్రాములకు ప్రస్తుతం రూ 59,670 వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరతో పాటే వెండి రేట్లు కూడా భారీగా పడిపోయాయి. దిల్లీలో కిలో వెండి తాజాగా రూ.900 పడిపోగా కిలోకు ప్రస్తుతం రూ.73100 వద్ద ఉంది. వరుసగా 4 రోజుల్లోనే రూ.1400 మేర పడిపోయింది. ఇక హైదరాబాద్లో కూడా సిల్వర్ రేటు ఒక్కరోజే రూ. 1000 పడిపోగా కేజీ వెండి రేటు హైదరాబాద్లో రూ.77,500కు చేరింది. ఇక్కడ 4 రోజుల వ్యవధిలో వెండి ధర రూ.2300 వరకు తగ్గింది.