హైదరాబాద్ : కాచిగూడ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి కేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మూడు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి, గోల్నాక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు పరస్పర నినాదాలు చేసుకున్నారు. దళిత బందులో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కేటీఆర్‌కు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంటరై పరిస్థితిని అదుపు చేశారు.