తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేసింది.
ఇక రేపు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. అలాగే నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వానలు పడతాయని పేర్కొంది.