పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రయాణికున్ని ఇద్దరు దుండగులు రైల్లో నుంచి తోసేశారు. ప్రయాణికుడు రమేష్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు కోసం గొడవపడిన వారికి నచ్చచెప్పినందుకు రైల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రయాణికుడిని తోసేశారు. ప్రమాదంలో రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కుమ్మవారి పల్లెకు చెందిన రమేష్ కుమార్ గా గుర్తింపు. బాధితుడే 108కు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.