టీఎస్-ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 93.07శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. పాలిటెక్నిక్, బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.