బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండిసంజయ్ చేసిన ట్వీట్‌కు కవిత కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు.
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో… భేటీ పడావో. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి. మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం . ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం. ఆడబిడ్డ తలుచుకుందంటే ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
బండి సంజయ్ ట్వీట్ ఇదే..
అంతకుముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండిసంజయ్ ట్వీట్ చేశారు. ‘‘గవర్నర్ కు దక్కదు గౌరవం. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ. బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి. బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం’’ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.