చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. తమిళ, మలయాళ భాషల్లో విలన్ పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ (Kazan Khan) కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారు జామున గుండెపోటుతో అయన మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. కజాన్ ఖాన్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సెంతమిజ్ పట్టుతో తమిళంలోకి అడుగుపెట్టిన కజాన్ ఖాన్.. సేతుపతి IPS, కట్టుమరక్కరన్, మాప్పిళ్ళై గౌండర్ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఉల్లతై అల్లిత, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, ప్రియమానవాలే వంటి చిత్రాలలో విలన్ గా నటించారు. 2008 సంవత్సరంలో విడుదలైన పట్టాయ కెళప్పు భాషలో ఆయన చివరి చిత్రం.