ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణలో విద్యాసంస్థలు ఓపెన్ చేసి రెండ్రోజులు కూడా కాలేదు. అప్పుడే రెండు విషాదకర ఘటనలో చోటు చేసుకుున్నాయి. ఈ ఉదయం నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడవగా.. తాజాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యా కుసమం నేలరాలింది. క్యాంపస్‌లో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ బాత్‌రూంలో ఆమె చున్నీతో ఉరేసుకుంది.
ఈ ఉదయం బాత్‌రూంకి వెళ్లిన దీపిక ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో భద్రతా సిబ్బంది డోర్లు పగలగొట్టి చూడగా.. ఆమె కిటికీకి ఉరేసుకొని కన్పించింది. వెంటనే విద్యార్థిని బైంసా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెదింనట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని సంగారెడ్డి జిల్లాకు చెందినదిగా గుర్తించారు. అయితే ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. చదువుల వల్ల మానసిక ఒత్తిడా ? లేక మరదైనా కారణమా ? తెలియాల్సి ఉంది. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.