జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మచిల్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భారత సైన్యానికి పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో భద్రతా బలగాలు మంగళవారం ఉదయం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో స్కూళ్లను మూసివేశారు. ఈ నెల మొదట్లో రాజౌరి జిల్లాలో ఓ ఉగ్రవాదాన్ని బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా, సైన్యం అప్రమత్తమై ఉగ్రవాదిని కాల్చి చంపింది.