ఆదాయపు పున్ను చెల్లింపుదారులకు ఇదే హెచ్చరిక. అడ్వాన్స్ ట్యాక్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించేందుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. జూన్ 15లోపు మీ ఆడ్వాన్స్ పన్ను చెల్లించాలని ఇప్పుటికే ఆదాయపు పున్ను శాఖ అలర్ట్ చేసింది. ఈ గడువలోపు మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. లేదంటే ఆ తర్వా భారీగా పెనాల్టీ, వడ్డీ సైతం కట్టాల్సి రావచ్చు. జూన్ 15, 2023 నాటికి తమ ట్యాక్స్‌లో 15 శాతం అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పన్ను చెల్లింపుదారులకు సూచనలు చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ‘ పన్ను చెల్లింపుదారులు దయ చేసి గమనించండి. జూన్ 15, 2023లోపు మీ అడ్వాన్స్ ట్యాక్స్ తొలి దఫా పేమెంట్స్ చేయాలని గుర్తుంచుకోండి.’ అంటూ ఓ వీడియోతో పాటు ట్వీట్ చేసింది ట్యాక్స్ డిపార్ట్మెంట్.
అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి?
అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఆదాయపు పన్నులో కొంత భాగం. ఒకసారి పెద్ద మొత్తంలో చెల్లించకుండా కేంద్రం సూచించిన తేదీల్లోపూ ఇన్స్టాల్మెంట్లుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఆర్థిక ఏడాదిలో రూ.10 వేలు అంతకన్నా ఎక్కువ ట్యాక్స్ చెల్లించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ఫ్రీలాన్సర్స్, బిజినెసుల వంటి అందరికి వర్తిస్తుంది. అయితే, 60 ఏళ్లు, ఆపైన వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు బిజినెస్ నుంచి ఆదాయం లేనట్లయిత వారికి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. మార్చి 31 నాటికి మొత్తం ట్యాక్స్ చెల్లింపులు పూర్తి చేయాలి.
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఏమౌతుంది?
గడువులోపు మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేకపోతే, లేట్ పేమెంట్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 234బీ, 234సీ ప్రకారం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంతే కాదు సమయానికి పేమెంట్స్ చేయకపోతే భారీగా పెనాల్టీలు సైతం పడవచ్చు. అందుకే ఈ పెనాల్టీలు తప్పించుకోవాలంటే సమయంలోపు ట్యాక్స్ చెల్లించడం ఉత్తమం.