హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ఈ నెల 17న ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్టు డిఫెన్స్ విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దుండిగల్‌లోని అకాడమీలో జరగనున్న ఈ పరేడ్‌కు సంబంధించి వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్లకు ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయినట్టు తెలిపింది. పరేడ్ అనంతరం ప్రతిభ చూపిన క్యాడెట్లకు ర్యాంకులు, అవార్డులు అందజేస్తారని పేర్కొన్నది. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డు, వైమానిక దళ క్యాడెట్లు, మన దేశంతో స్నేహపూర్వకంగా ఉండే సరిహద్దు దేశాలకు చెందిన క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ను రాష్ట్రపతి ప్రదానం చేస్తారని వివరించింది.