తెలంగాణ కోసం పోరాడిందే కృష్ణా నది జలాల కోసమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తొమ్మిదేళ్ళుగా ఎస్ఎల్ బీసీ, నక్కల గండి పెండింగ్ పనులపై మాట్లాడితే తన పై ఇద్దరు జిల్లా నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆయన గుర్రంపోడ్ మండలం గుడిపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్గొండ జిల్లా ప్రజల నీటి సమస్యలను అడిగితే ఒకరు నా పంచ గురించి మాట్లాడుతున్నారని, నీళ్లు ఇవ్వకుండా చేసింది గాడిదలు కాయడానికా? చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ కాలువల్లో నీళ్లు ఇచ్చి …లష్కర్లు చేసే పని చేయడానికా జిల్లా మంత్రి ఉందని ప్రశ్నించారు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు. పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా? అని భట్టి ప్రశ్నించారు.