10మంది మృతి
ఆస్ట్రేలియాలో పెండ్లి బృందం వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూ సౌత్ వేల్స్‌లోని హంటర్ వ్యాలీలో జరిగింది. వైన్ టూరిస్టులకు ఈ ప్రాంతం చాలా ఫేమస్. వెడ్డింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో బస్సు బోల్తా కొట్టింది. ఆ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిని గుర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే కొత్తగా పెళ్లిన జంట మాత్రం ఆ బస్సులో లేనట్లు తెలిసింది. రాత్రి 23:30 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ భారీగా మంచు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. సింగల్టన్ వైపు అతిథులు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆసీస్ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సంతాపం తెలిపారు.