వికారాబాద్: జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు. యువతిని బావ అనీలే హత్య చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక సమాచారం…. సంకేతిక సమాచారం ద్వారా పోస్ట్‌మార్టం రిపోర్ట్, పలువురు సాక్షుల ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు.
హత్య… ఆత్మహత్య అనేది తాము ఇంకా తేల్చలేదన్నారు. రెండు కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిన.. హత్య జరిగిన ఎవరిని వదిలేది లేదన్నారు. నిందితులను గుర్తించి.. కఠినంగా శిక్షిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చామన్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని.. విచారణ కొనసాగుతోందని ఎస్‌ఐ విఠల్ రెడ్డి పేర్కొన్నారు.