హైదరాబాద్ విమానాశ్రయంలో యువతి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్ నుంచి కింది దూకేందుకు యత్నించింది. అయితే, అక్కడేవున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఆమెను కాపాడారు.
ఆ సమయంలో మహిళ తనతో పాటు ఉన్న తన స్నేహితుడితో గొడవపడింది. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అక్కడున్నవారు స్పందించి ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిందని విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు వెల్లడించారు. యువతికి ప్రాణాపాయం తప్పటంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.