హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లోగల సెన్సేషనల్ సెలూన్ అనే మసాజ్ పార్లర్‌పై పోలీసులు ఆదివారం దాడి జరిపి నలుగురు మహిళలతో సహా ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
మసాజ్ పార్లర్ ముసుగులో అక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్(ఆగ్నేయ) పోలీసులు సెన్సేషనల్ సెలూన్‌పై దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులతోపాటు పెలూన్‌లో పనిచేసే నలుగురు మహిళా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.