మంత్రి మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మాటలతోనే కాదు.. ఆటతోనూ అలరిస్తుంటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో వినూత్న వేషధారణలు కార్యక్రమాలతో మంత్రి మల్లారెడ్డి అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ రన్ లో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చౌరస్తాలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన స్టెప్పులు ఇరగదీస్తూ తెగ హైలైట్ అయ్యారు. ఇక అక్కడ యువతీయువకుల నడుమ చిందేస్తూ సందడి చేశారు. అంతేనా? విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకొని చిందులు వేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మహిళా కళాకారులతో బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. 70 ఏళ్ల వయసులో సైతం మల్లారెడ్డి స్టెప్పులతో అదరగొట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.