ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ కూసుమ జగదీశ్ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జగదీశ్ పార్థివదేహాన్ని వారి స్వగ్రామం మల్లంపల్లిలో సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జగదీశ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. మంచి సోదరుడిని కోల్పాయామన్నారు.