AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శిరీష హత్య కేసులో అనేక అనుమానాలు ..

హత్యకు కారణం ఏంటీ.. హంతకులెవరూ..
ఒళ్లు జలదరించేలా జరిగిన 19 ఏళ్ల యువతి శిరీష హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్‌లో జరిగిన అతి కిరాతకమైన హత్యకు కారణం ఏంటీ.. హంతకులెవరూ.. అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. శిరీష గొంతు కోసి.. అత్యంత పాశవికంగా హత్య చేశారు.

అంత ఆటవికంగా హత్య చేయటం వెనుక మోటివ్ ఏంటనేది మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. శిరీష కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలు, మృతదేహాం కనిపిస్తోన్న తీరును చూస్తుంటే.. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీష హత్య కేసులో అనుమానితుడు బావ అనిల్ నోరువిప్పని పరిస్థితి. శిరీష ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే యువతి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకుందని పోలీసులకు అనిల్ చెప్పినట్టు సమాచారం. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తండ్రిని, బావను బెదింరించే ప్రయత్నం చేసిందని అనిల్ చెప్పాడు. దీంతో తలుపులు పగులగొట్టిన అనిల్ శిరీషను బయటకు లాగి ఫోన్‌ను లాక్కున్నాడు. అనంతరం వారిని ఇంట్లో ఉంచి బయట నుండి గడియ పెట్టి వెళ్ళినట్టు తెలుస్తోంది.

ఆపై శిరీష ఇంటి నుంచి పారిపోయి ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే నీళ్ళలో దూకే సమయంలో కళ్ళలో ఏదో గుచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రీ పోస్ట్ మార్టం కోసం పోలీసులు, డాక్టర్… యువతి ఇంటికి చేరుకున్నారు. అత్యాచారం జరిగిందా లేదా అనేది పరీక్షల్లో వైద్యులు నిర్ధారించనున్నారు. లేడి డాక్టర్ వైష్ణవి పరిగి నుంచి కాడ్లాపూర్‌కు వచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో గొడవ జరిగితే యువతి తండ్రి పొంతనలేని సమాధానం చెప్తున్నాడు. మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యం?.. కుంటలోనే కంటికి గాయాలైతే తలపై రక్తం ఎందుకు గడ్డ కట్టింది…?.. అస్సలు ఇంట్లో గొడవలకు కారణాలేంటి…?.. ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10