‘తన వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ..’
అప్సర ఎపిసోడ్లో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఆదివారం నాడు భర్త కార్తీక్‌తో అప్సర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అయిన ఫోటోలు రియల్ అంటూ లేటెస్ట్గా ఆడియో రిలీజ్ చేసింది కార్తీక్ తల్లి. పెళ్లి మాట నిజం.. కాపురం మాట నిజం.. తన బిడ్డ చావుకి అప్సర కారణం అన్నది కూడా అంతే నిజమని మ్యాటర్ మొత్తం రివీల్ చేసింది ధనలక్ష్మి. ఆమె ఆరోపణలతో అప్సర హత్య కేసు మరో టర్న్ తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన కార్తీక్‌తో వివాహం అయినట్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై అప్సర తల్లి స్పందించారు. సాయికృష్ణను కాపాడేందుకు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది.
అప్సర అంటే తమకేమాత్రం ఇష్టం లేదని.. కార్తీక్‌కి నచ్చడంతోనే ఇద్దరికీ పెళ్లి చేశామన్నారు ధనలక్ష్మి. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెట్టి తన నైజం చాటుకుందన్నారు. టూర్లు, లగ్జరీ లైఫ్‌ని అప్సర ఇష్టపడేదని.. ఆ ఇష్టాలతో కార్తీక్‌ను టార్చర్ పెట్టేదన్నారు ధనలక్ష్మి. ఆ వేధింపులు భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అటు అప్సర తల్లి మాత్రం పెళ్లి మ్యాటర్ అప్రస్తుతం అని.. పోలీసులే తమకు న్యాయం చేయాలంటోంది. మరోవైపు సాయికృష్ణ తండ్రి మాత్రం దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయంటున్నారు. మొత్తానికి అప్సర ఎపిసోడ్ అంతులేని కథగా కంటిన్యూ అవుతోంది.