ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బెలూన్ తెరచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. కారు పాక్షికంగా ధ్వంసమైంది.
బైక్‌పై ఉన్న వ్యక్తి గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు కూడా స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి సమీపంలో పెద్ద వృక్షం ఉందని, దాన్ని ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు.