AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌లో అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్

భారతదేశంలోని అత్యంత సంపన్నులైన మహిళ జాబితాలో జిందాల్ గ్రూపు చైర్‌పర్సన్ ఓపి సావిత్రి జిందాల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఫోర్బ్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం సావిత్రి జిందాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.14,000 కోట్లని ఫోర్బ్ వెల్లడించింది. విజయవంతమైన వ్యాపారవేత్తగానే గాక రాజకీయాలలో సైతం ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండవ స్థానంలో వినోద్ రాయ్ గుప్తా ఉన్నారు. హవెల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తల్లి అయిన వినోద్ రాయ్ గుప్తా ఆస్తుల విలువ 6.3 బిలియన్ డాలర్లు. ఇక మూడవ స్థానంలో రాకేష్ జుంజున్‌వాలా సతీమణి రేఖా జుంజున్‌వాలా ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 5.9 బిలియన్ డాలర్లు.

ఈ జాబితాలో ఇంకా నాయక్ సిఇఓ ఫల్గుని నాయర్(4.08 బిలియన్ డాలర్లు), ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీ యుఎస్‌వి పైవేట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ లీనా తివారీ, బైజూ వ్యవస్థాపకురాలు దివ్యా గోకుల్‌నాథ్, ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ సిఇఓ మల్లికా శ్రీనివాసన్, బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుండార్ షా, థెర్మాక్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు అను అఘా ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10