మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్‌ని నింపింది. విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. అవినీతితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనేందుకు ఈ గెలుపే నిదర్శనమన్నారు అమిత్‌షా. అటు బండి సంజయ్‌తోపాటు పార్టీ నయకత్వాన్ని కూడా అభినందించారు నడ్డా. ఈ మేరకు ఈ ఇరువురు నేతలు తెలుగులో ట్వీట్ చేశారు.
టీచర్ ఎమ్మెల్సీ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాయి పార్టీ శ్రేణులు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో బండి సంజయ్, డీకే అరుణ, ఏవీఎన్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. విజయం సాధించిన రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు బండి సంజయ్. అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు బండి సంజయ్.. బీజేపీ విజయంలో భాగమైన ఉపాధ్యాయులకు అభినందనలు చెప్పారు.