మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా RRR రికార్డ్ చేసింది. ఆ సినిమాలో నాటు నాటు పాటకుగానూ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్నారు. ఇప్పుడు ఆస్కార్ వీరుల రాక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నెమ్మదిగా ఒక్కొక్కరుగా మన దేశానికి చేరుకుంటున్నారు. రెండు రోజుల ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన్ని స్వయంగా సతీమణి లక్ష్మీ ప్రణతి రిసీవ్ చేసుకుంది. శుక్రవారం ఉదయం రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, కార్తికేయ, రమా రాజమౌళి ఇతరులు రీచ్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అంత కోలాహలంగా మారింది. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే వారు మాత్రం ఎలాంటి హంగామా చేకుండా అక్కడి పోలీసు భద్రత మధ్య బయటకు వెళ్లిపోయారు.
మెయిన్ RRR టీమ్ అంతా హైదరాబాద్ చేరుకుంది. ఒక్క రామ్ చరణ్ మినహాయిస్తే. ఆయన మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం రామ్‌చరణ్‌ని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదు. అయితే అక్కుడన్న మీడియాతో మాత్రం మాట్లాడారు. నాటు నాటు పాటను దేశ ప్రజలు బాగా ఆదరించారని, ఆ పాట తమ సినిమా పాట కాదని దేశ ప్రజలందరిదని ఆయన పేర్కొంటూనే అందరికీ ధన్యవాదాలను తెలియజేశారు.
RRR టీమ్‌లో అందరూ హైదరాబాద్ చేరుకుంటున్నారు. కానీ.. ఒక్క రామ్ చరణ్ మాత్రం ఢిల్లీకి వెళ్లటం ఎందుకా? అని అందరూ అనుకుంటున్నాయి. అయితే మీడియాలో వినిపిస్తోన్న సమాచారం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చరణ్ ఢిల్లీకి చేరుకున్నారట. సాయంత్రం ప్రధాని నివాసంలో ఆయన్ని చరణ్, ఉపాసన వెళ్లి ప్రత్యేకంగా కలవబోతున్నారనేది సమాచారం. ఆయనతో భేటీ తర్వాతే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరకుంటారట చరణ్ దంపతులు.