సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో చీకట్లను నింపింది. పాతికేళ్లు కూడా నిండని ఆరుగురి ప్రాణాలు మంటల్లో ఆహుతి అయ్యాయి. ఈ క్రమంలోనే స్వప్నలోక్ అగ్ని ప్రమాదంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన త్రివేణి అనే యువతి మరణించింది. త్రివేణి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. త్రివేణి తండ్రి రామరావు ఆటో డ్రైవర్, తల్లి కూలీ పనులు చేస్తుంది. కష్టపడి చదివించి ప్రయోజకురాలు అవుతుందని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే ఇలా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో విషాధ చాయలు నెలకొన్నియి. ఈ వార్త తెలియగానే త్రివేణి తల్లిదండ్రులు అర్థరాత్రి గాంధీ ఆసుపత్రికి వచ్చారు చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా మారడంతో వారి రోదనలు మిన్నంటాయి. కష్టపడి చదివించి ప్రయోజకురాలు అవుతుందని ..అనుకుంటే..ఇలా ప్రాణాలు కోల్పోతుందని అనుకోలేంటున్నారు.
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో.. మొత్తం ఆరుగురు, ఎవ్వరికీ పాతికేళ్లు కూడా లేవు, కానీ అందరికీ నూరేళ్లు నిండిపోయాయ్. అర్ధాంతరంగా ఆయుష్షు ముగిసిపోయింది. ఏం అనుభవించారని ఈ చావులు..చేతికంది వచ్చిన పిల్లలు..అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..పిల్లలపై కన్నవాళ్లు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ తల్లిదండ్రుల కన్నీటికి సమాధానం చెప్పేదెవరు? ఈ అయినవాళ్లు రోదనకు భరోస ఇచ్చేదెవరు? ఏం జరుగుతుందో తెలిసే లోపే ఊపిరి ఆగిపోయింది. వాళ్ల తప్పు లేకుండానే ప్రాణాలు పోయాయి. అంతులేని నిర్లక్ష్యానికి అన్యాయంగా బలైపోయారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ ఫైర్ యాక్సిడెంట్‌లో గుండెల్ని పిండేసే నిజం ఇది.