AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మళ్లీ పెళ్లి’ని వెంటనే ఆపేయండి

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నరేష్ మూడో భార్య..
నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన సినిమా మళ్ళీ పెళ్లి. మే 26న తేదీ అనగా రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇంతలో సీన్ లోకి నరేష్ వైఫ్ రమ్య రఘుపతి వచ్చేసింది. మళ్ళీ పెళ్లి మూవీ విడుదలకు వెంటనే ఆపేయాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. తన ప్రతిష్ట ను కించ పరిచేలా మళ్లీ పెళ్లి సినిమా ఉందని, వెంటనే ఈ సినిమా విడుదల ఆపాలి అంటూ పిటిషన్ వేసింది. దీంతో నరేష్- పవిత్ర లోకేష్- రమ్య రఘుపతి నడుమ నడుస్తున్న వ్యవహారాలు మరోసారి హాట్ ఇష్యూ అయ్యాయి.

నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్ అయింది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఇష్యూస్ లో ఇదొకటి. సరిగ్గా ఈ తరుణంలో ఆ ఇద్దరే మళ్లీ పెళ్లి అనే సినిమా చేయడం ఆసక్తికరం. పవిత్ర లోకేష్‌తో కలిసి నరేష్ సహజీవనం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతుండగా.. ఈ ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సడెన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10