AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత మూడో అంతస్తులో మొదలైన అగ్నికీలలు క్షణాల వ్యవధిలోనే భవనమంతా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి పక్కనున్న భవనాలకూ వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనం ముందు పార్క్‌ చేసిన ఓ కారుతో పాటు పలు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కూలిపోతోందని తెలిపారు. ప్రమాదస్థలానికి కొద్ది దూరంలోనే సిడ్నీలోని అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ ఉంది. కాగా.. అగ్నిప్రమాదం జరిగిన భవనం కొంతకాలంగా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిరాశ్రయులు ఆ భవనంలో ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10