AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నూలుకు చేరుకున్న సీబీఐ బృందం..

వివేకా హత్య కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కాగా.. నేడు ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనున్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించనున్నారు.

అవినాశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు విచారణ అనంతరం తీర్పును హైకోర్టు వెల్లడించనుంది. ఇప్పటికే సీబీఐని అరెస్ట్ చేయకుండా చూడాలన్న.. అవినాశ్‌ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.ముందస్తు బెయిల్‌పై అవినాశ్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌లో సునీతారెడ్డి ఇంప్లీడ్ కానున్నారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను.. కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10