AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమగ్ర విచారణ జరపాలి..

హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంజయ్ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. భవిష్యత్‎లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే..అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వికారాబాద్ సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం ఫసల్ భీమా పథకం ద్వారా రైతులను ఆదు కుంటున్నప్పటికీ రాష్ట్రంలో వర్తింపజెయకుండా కేసీఆర్ పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10