తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు.. 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని తిరుపతి (Tirupati) రుయా ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో.. బస్సు బోల్తా పడింది.
తిరుమలలో విధులు ముగించుకుని తిరుపతికి ప్రయాణమైన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నారు. ఆయన వెంటనే స్పందించి.. బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు వచ్చారు. అయితే.. అతివేగమే ప్రమాదానికు కారణమని అంటున్నారు. కానీ.. డ్రైవర్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. బస్సును తొలగించారు. ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.