కర్నాటక అసెంబ్లీ నూతన స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే యుటి ఖాదర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కర్నాటక అసెంబ్లీ స్పీకర్గా మొట్టమొదటిసారి ఒక ముస్లిం నాయకుడు ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఖాదర్ పనిచేశారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంతోపాటు, జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఖాదర్ మంత్రిగా పనిచేశారు.