అతడి విజయం స్పూర్తిదాయకమన్న సజ్జనార్
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. ఈసారి సివిల్స్‌లో మహిళలు సత్తా చాటారు. సివిల్స్ ర్యాంకులు సాధించిన వారిలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. కర్ణాటకలో ఓ బస్సు కండక్టర్ కుమారుడు సివిల్స్‌లో సత్తా చాటాడు. 589వ ర్యాంకు సాధించాడు. కర్టాణకలోని దర్వాడ జిల్లా అన్నెగిరికి చెందిన సిద్దలింగప్ప ఆలిండియా లెవల్‌లో 589 ర్యాంకుతో మెరిశాడు. అతడి తండ్రి కరసిద్ధప్ప కర్ణాటక ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా పని చేస్తు్న్నాడు. అతడి విజయం పట్ల సంతోషం వ్యక్తంచేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
“యూపీఎస్సీ ఫలితాల్లో వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (NWKRTC) కండక్టర్ కొడుకు మెరిశారు. కర్ణాటకలోని దర్వాడ జిల్లా అన్నెగిరికి చెందిన సిద్ధ లింగప్ప సివిల్స్‌లో ఆలిండియా 589వ ర్యాంకు సాధించారు. పనిచేసుకుంటూ చదివి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే రెండో ప్రయత్నంలోనే విజయం సాధించడం అభినందనీయం. పేద కుటుంబానికి చెందిన సిద్ద లింగప్ప సోషల్ మీడియా సాయంతో సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు. ఆయన సాధించిన ఈ ఘనత ఎంతో మంది యువకులకు స్పూర్తిదాయకం. దేశంలోని ప్రజా రవాణా సంస్థ సిబ్బందికి ఇది గర్వకారణం. సిద్ధ లింగప్పను ప్రోత్సహించిన ఆయన తండ్రి, బస్ కండక్టర్ కరసిద్ధప్పకు తెలంగాణ ఆర్టీసీ కుటుంబం తరపున శుభాకాంక్షలు” అని సజ్జనార్ ట్వీట్ చేశారు.