ప్రముఖ బాలీవుడ్ నటుడు నితేష్ పాండే కన్నుమూశారు. నాసిక్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నితేశ్ కు హార్ట్ అటాక్ రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని స్థానిక హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. 51 ఏళ్ళు నితేశ్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నితేశ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
1973లో జన్మించిన నితేశ్.. BITV లో ప్రసారమయ్యే తేజస్ షోతో టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆతరువాత, మంజిలీన్ ఆపని అపాని, అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి చాలా సీరియల్స్‌లో నటించాడు. కేవలం టీవీ సీరియల్స్ లోనే కాదు.. ఓం శాంతి ఓం, ఖోస్లా కా ఘోస్లా వంటి చిత్రాలతో వెండితెరపై కూడా మెప్పించాడు.
నితేష్ 1998లో అశ్విని కల్సేకర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 2002లో వారు విడిపోయారు. తరువాత నితేశ్ TV నటి అర్పితా పాండేని వివాహం చేసుకున్నాడు.