హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో తనిఖీలు చపట్టిన పోర్టులో కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కడపకు చెందిన ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో సుమారు 1.80కోట్ల విలువైన బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.