AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేకలను చంపి రక్తాభిషేకం.. 9 మంది ఎన్టీఆర్ అభిమానుల అరెస్ట్

తమ అభిమాన హీరో టీజర్ కానీ, బర్త్ డే కానీ సినిమా రిలీజైనా అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. కేక్ కటింగ్ లు, బ్యాండ్ బాజాలు, టపాసులు ఇలా ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం అవధులు దాటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేటెస్ట్ గా మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నాడు చేసిన అత్యుత్సాహానికి కొందరు అభిమానులు జైలుపాలయ్యారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో నూ తారక్ కు అభిమానులు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.. కొరటాల శివతో నటిస్తోన్న మూవీ దేవర పోస్టర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నాడు రిలీజ్ చేశారు. కర్ణాటకలో కొందరు అభిమానులు రెచ్చిపోయారు. కర్ణాటకలోని రాబర్ట్ సన్ పేటలో ఓ థియేటర్ బయట ఉన్న ఎన్టీఆర్ దేవర పోస్టర్ పై రక్తాభిషేకం చేశారు. అది మామూలుగా కాదు రెండు మేకలు చంపి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్ పై పూశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ నోటా ఈ నోటా కలిసి అది పోలీసుల వరకు వెళ్లింది. ఎంక్వైరీ చేసి రక్తాభిషేకం చేసిన తొమ్మిది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పి.శివనాగరాజు, కె సాయి, జి సాయి, డి నాగభూషణం, వి సాయి, పి నాగేశ్వరరావు, వై ధరణి, పి శివ, బి అనిల్ కుమార్‌లుగా గుర్తించారు. అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10