AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మురికివాడ నుంచి మోడల్‌గా ఎదిగిన చిన్నారి

ముంబైలోని ధారావి మురికివాడలో పుట్టిన ఒక 14 ఏళ్ల బాలిక మలీఫా ఖర్వా అంతర్జాతీయ మోడల్‌గా మారింది. ఇది నమ్మలేని నిజం. సూపర్‌మోడల్‌గా మారి తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఆ నిరేపేద బాలిక స్వప్నం సాకారమైంది. ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్ణనమిచ్చిన ఆ చిన్నారి ఇప్పుడు ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కొత్తగా లాంచ్ చేసిన యువతి కలెక్షన్‌కు బ్రాండ్ ఎంబాసిడర్‌గా మారింది.

ధారావి మురికివాడలో నివసించే ఆ బాలిక జీవితం 2020లో మలుపు తిరిగింది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మాన్ తన మూజిక్ వీడియో షూటింగ్ కోసం ముంబై రాగా మలీషా ఆయన కంట పడింది. ఆమె కల నెరవేర్చడానికి ఆయన మలీషా కోసం గోఫండ్‌మి పేజ్ ఏర్పాటు చేసేందుకు ఆమె కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో మొత్తం 113 పోస్టులు ఉండగా ఆమె ఫాలోవర్ల సంఖ్య 2.20 లక్షలకు చేరుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ యువతి కలెక్షన్‌కు మోడల్‌గా మారిన మలీషాకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. యువజనుల మేధకు సాధికారతను సమకూర్చడమే లక్షంగా ఈ కలెక్షన్‌ను ఫారెస్ట్ ఎసెన్షియల్స్ తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మలీషా సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10