AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అరుణ్‌ పిళ్లైకి మరో మూడ్రోజులు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీని సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గురువారంతో అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణ ముగిసింది. దీంతో పిళ్లైను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. మరోసారి పిళ్లై కస్టడీ పొడిగించాలంటూ ఈడీ (ED) అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. లిక్కర్ స్కామ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవితతో పాటు పిళ్లైను విచారించాలనీ.. కానీ కవిత విచారణకు హాజరు కాలేదని ధర్మాసనానికి ఈడీ అధికారులు తెలిపారు. దీంతో మరో మూడు రోజులు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే అనారోగ్య కారణాల చేత గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈనెల 20న (సోమవారం) హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న (శనివారం) హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10