AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్..

న్యూఢిల్లీ : భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో గురువారం కూలిపోయింది. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని, దీనిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం. గాలింపు బృందాలను రంగంలోకి దించినట్లు ఈ ప్రకటన వెల్లడించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10