ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. తొలుత ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఆ తరువాత అది కాస్తా.. 10:30 కు మారింది. కానీ అది కూడా లేదు. ఇంతవరకూ ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చిందే లేదు. 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా బయటకు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అసలు కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం అర గంట ఆలస్యంగా ఈడీ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.