AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటర్ విద్యార్థిని మోసం చేసిన గూగుల్ మ్యాప్

ఖమ్మం: గూగుల్ మ్యాప్ ను నమ్మి ఓ విద్యార్థి ఎగ్జామ్ రాయలేక పోయిన సంఘటన బుధవారం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. అయితే బుధవారం ఇంటర్ ఎగ్జామ్ ఉండగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్లేందుకు తనకి దారి తెలియక గూగుల్ మ్యాప్ చూశాడు. దీంతో మ్యప్ లో చూపించిన విధంగా విద్యార్థి వెళ్లాడు. తీర లోకేషన్ కి వెళ్లాక తెలిసింది తను వెళ్లవలిసింది అక్కడికి కాదని.

అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో చోటుకి గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకెళ్లింది. దీంతో కంగారు పడ్డ విద్యార్థి అక్కడ ఉన్నవారి సహాయంతో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. వినయ్ ఎగ్జామ్ సెంటర్ కి చేరుకునే సరికి 25 నిమిషాలు దాటిపోయింది. దీంతో అక్కడి సిబ్బంది వినయ్ ని లోనికి అనుమతించలేదు. దీంతో చేసేది ఏమీ లేక వినయ్ ఇంటికి వెళ్లాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10