హైదరాబాద్‌లో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న బాలికలు, యువతుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరుస మిస్సింగ్‌లతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా.. కూకట్‌పల్లిలో ఇద్దరు యువతుల మిస్సింగ్ చర్చనీయాంశంమైంది. జ్యోతి, లిఖిత రమ్య అనే ఇద్దరు యువతులు కనించకుండా పోయారు. జ్యోతి కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుండగా.. లిఖిత కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం చదువుతోంది. ఇంటర్ చదువుతున్న సమయం నుంచి వీరిద్దరూ స్నేహితులు కాగా.. రెండ్రోజుల నుంచి వారు కనిపించకుండా పోయారు.
అయితే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. తనను కాపాడాలంటూ జ్యోతి తన ఫ్రెండ్‌కు మేసేజ్ పెట్టింది. “నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. బాగా చీకటిగా ఉంది. భయంగా ఉంది. మా అన్నకు చెప్పు. ఒకసారి ఫోన్ ఇవ్వమంటే వీళ్లు ఇచ్చారు. ఫస్ట్ నీ నెంబరే ఉంది. అందుకే నీకు మెసేజ్ చేస్తున్నా. ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు.” అంటూ జ్యోతి మరో స్నేహితురాలికి మెసేజ్ పెట్టింది.
ముందు జ్యోతి మాత్రమే కనిపించకుండా పోయిందని పోలీసులు కంప్లైంట్ అందింది. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు మెుదలు పెట్టారు. ఆ తర్వాత జ్యోతి ఫ్రెండ్ లిఖిత కూడా కనిపించకుండా పోవటంతో పోలీసులు ఖంగుతున్నారు. లిఖిత కనిపించటం లేదంటూ కూకట్ పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె తండ్రి.. తన కూతురు మిస్సింగ్‌కు జ్యోతే కారణమని ఆరోపించారు. జ్యోతే తన కూతుర్ని ఎక్కడికో తీసుకెళ్లి ఉంటుందని అన్నారు.