తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ నేతల వైఖరిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో జాతీయ మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మహిళలను గౌరవించకుండా అధికార పార్టీ బీఆర్ఎస్‌కి చెందిన నాయకులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మకు ఫిర్యాదు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ తనను దుర్భాషలాడారని..పాదయాత్ర చేస్తుంటే దాడులకు దిగారని..వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్‌కు విన్నవించుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫిర్యాదుపై స్పందించిన మహిళ కమిషన్ అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాలు మహిళలపై ప్రజాప్రతినిధులు చేసిన అనుచిత వ్యాఖ్యల చుట్టే తిరుగుతున్నాయి. పాదయాత్ర చేస్తున్న తనపై మహిళా అనే గౌరవం లేకుండా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలోని జాతీయ మహిళ కమీషన్‌ను కలిసిన ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారని..ఎలా బయట తిరుగుతావో చూస్తామంటూ పబ్లిక్‌గానే బెదిరిస్తున్నారని వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మకు ఫిర్యాదు చేశారు.