కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యే రాజయ్య
ఓ చర్చి ఫాదర్ బర్త్‌డే వేడుకల్లో ఎమ్మెల్యే కంటతడి
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై లైంగిక ఆరోపణలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ చర్చి ఫాదర్ బర్త్‌డే వేడుకల్లో కేక్ ఎదుట కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేషన్ ఘనపూర్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజయ్య. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆయన కన్నీరు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది.
తనన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తన కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని.. రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్ లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతా అంటూ శపథం చేశారు ఎమ్మెల్యే రాజయ్య.