21 రోజుల్లో 2.5 కోట్ల హుండీ ఆదాయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత గత 21 రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు హుండీ ఆదాయం సమకూరింది. గత మూడు వారాల్లో స్వామివారి ఆదాయం.. అక్షరాలా 2 కోట్ల 5 లక్షల 55 వేల 422 రూపాయలు. ఈ నగదుతోపాటు 45 గ్రాముల బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండి కూడా భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు.
టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. హుండీ ఆదాయంతోపాటు మొత్తంగా ఆలయ వార్షిక ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది.