హైదరాబాద్ లో ఉగ్రలింకులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఫేక్ ఆధారాలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులతో పాటు హైదరాబాద్ కు చెందిన టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. తనకు,తన కుటుంబానికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని లేఖలో పేర్కొన్నారు. తమకు భద్రత కల్పించాలని ప్రధానిని, హోమంత్రిని కోరారు.