రాష్ట్రంలో నయా నిజాం పాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో నిజాం పాలనను తరిమిగొడతామని.. గడీలను బద్ధలు కొట్టడానికే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి తెలిపారు. నిరుద్యోగ మార్చ్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై వెనక్కి తగ్గేదే లే అని, పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ తో నష్టపోయిన ప్రతి అభ్యర్థికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక బిశ్వాల్ కమిటీ నివేదిక అమలు చేస్తామని.. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.