పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలని పాకిస్థార్ సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ మేరకు ISI డీజీకి ఉత్తర్వులు ఇచ్చింది.పాకిస్తాన్ సుప్రీంకోర్టు విడుదలకు ఆదేశాలు ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇస్లామాబాద్ జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేశారు.అనంతరం ఆయన లాహార్ కు పయనం అయ్యారు.