తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని.. తొమ్మిదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. సంగారెడ్డిలోని నిరుద్యోగ బీజేపీ మార్చ్ వేదికగా.. ప్రభుత్వంపై ఆమె విమర్శలు కురిపించారు. నిరుద్యోగులను, విద్యార్థులను కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ముప్పై, నలభై లక్షలకు టీఎస్పీఎస్సీ పేపర్ లు అమ్ముకున్నారని ఆరోపించారు. విద్యావ్యవస్థను వ్యాపారంగా మార్చారని ఆగ్రహించారు. పరీక్ష రద్దు చేస్తున్నామని చెప్పి ఒక్క మాటతో చేతులు దులుపుకుంటున్నారని.. మరీ ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.నిరుద్యోగులకు కేసీఆర్ ఏం సమాధానం చేస్తారు? అని నిలదీశారు. ప్రతి అభ్యర్థికి కేసీఆర్ లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని తెలిపారు.నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.