ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ పై బీజేపీ ఎంపీ విష్ణువర్ధన్ ప్రశంసల వర్షం కురిపించారు. నటుడు ప్రభాస్ అజాత శత్రువు అని కొనియాడారు. అగ్రహీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లోఆదిపురుష్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ స్పందిస్తూ.. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలను ఖండించారు. అద్భుతమైన సినిమాను రాజకీయ కోణంలో చూస్తూ, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జై శ్రీరామ్ అంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు.ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. దేవదత్త నాగె హనుమంతుడి పాత్ర పోషించారు.