హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో అరెస్టు చేసిన వారికి సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. హెచ్‌యుటి సంస్థ 50 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 16 దేశాల్లో ఇజబ్ ఉట్ తెహ్రిర్పై నిషేధం ఉంది. ప్రజాస్వామ్య దేశాలను టార్టెట్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎటిఎస్ కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నిందితులు సలీమ్, రెహ్మాన్, జునైద్, అబ్బాస్, హమీద్, సల్మాన్‌లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, భోపాల్‌లో అరెస్టయిన 17 మందిని ఎటిఎస్ అధికారులు విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఇతర సానుభూతిపరులపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది.